పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణానగర్ లోక్ సభ అభ్యర్థి తృణమూల్ కాంగ్రెస్ మహిళా నేత అయిన మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ విషయం సంబంధించి ఇదివరకే రెండుసార్లు సమన్లు పంపించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాజాగా బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈమెను విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరుకావాలంటూ ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది. అలాగే దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి కూడా సమన్లను జారీ చేసింది.
Also read: Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా విదేశాంగ ప్రతినిధి..!
ఈ కేసులో ఆమెను అధికారులు నాన్ రెసిడెన్షియల్ ఎక్స్టర్నల్, ఒక దేశం నుంచి మరో దేశానికి చెందిన అకౌంట్లకు సంబంధించిన నగదు చెల్లింపుల గురించి, వివిధ అకౌంట్స్ గురించి అలాగే వాటి లావాదేవీల గురించి ప్రశ్నించబోతున్నారు. గత సంవత్సరం ఆమె స్నేహితుడు న్యాయవాది అయిన జై అనంత్ దేహత్రయ పై కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా దర్శన్ హీరానందానికి పార్లమెంటుకు సంబంధించిన పాస్వర్డ్ ను మహువా మొయిత్రా ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
Also read: Nallimilli Rama Krishna Reddy: టీడీపీని వీడే ఆలోచనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే..?
ఇకపోతే, ప్రశ్నలకు ముడుపుల కేసు సంబంధంచి ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు ఆవిడ హాజరుకాలేదు. ఇదే కేసు సంబంధించి గత శనివారం సీబీఐ మహువా నివాసాల్లో, అలాగే వారి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా మరోసారి ఇప్పుడు ఈడీ ముచ్చటగా మూడోసారి ఆమెకు సమన్లు జారీ చేసింది. మహువా మొయిత్రాను పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల కేసులో విచారణ చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్ ఆదేశించింది.