Al-Falah University: లెక్కల్లో తేలని రూ.415.10 కోట్లు.. ఈడీ ప్రత్యేక ఫోకస్
- లెక్కల్లో తేలని రూ.415.10 కోట్లు
- ఈడీ ప్రత్యేక ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఉగ్ర కుట్రను వెలికితీసే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇక నిన్నటి నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 25 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో పలు అక్రమాలను గుర్తించారు.
ఇది కూడా చదవండి: Madrasa: ఉగ్రదాడుల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మదర్సాలకు కొత్త నిబంధనలు..
Also Read
యూనివర్శిటీ తప్పుడు అక్రిడిటేషన్ ద్వారా విద్యార్థుల నుంచి రూ.415.10 కోట్లు వసూలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఎటువంటి గుర్తింపు లేకుండానే ఈ ఫీజులు వసూలు చేసినట్లుగా కనిపెట్టారు. ఇక సోదాల్లో రూ.48 లక్షల నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా సంపాదిస్తున్న నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నారనే విషయంపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు.. విశ్వవిద్యాలయం ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Australia: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల భారతీయ గర్భిణీ మృతి
ఇదిలా ఉంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు పెద్ద ఎత్తున క్యాంపస్‌లో దాడులు చేస్తున్నారు. జామియానగర్‌లో సంస్థ చైర్మన్ ఇంట్లో సహా మొత్తం 25 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈడీ దాడుల నేపథ్యంలో క్యాంపస్‌లో ఉండాల్సిన చాలా మంది ప్రొఫెసర్లు ఇప్పుడు అదృశ్యమైనట్లుగా అధికారులు గుర్తించారు. అంతమాత్రమే కాకుండా క్యాంపస్‌కు సమీపంలో ఉండే చాలా మంది స్థానికులు కూడా కనిపించకుండా పోయారు. దీంతో అధికారులకు పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంటే క్యాంపస్ వేదికగా చాలా కుట్రలు జరిగినట్లుగా భావిస్తున్నారు.
ప్రస్తుతం హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓపి సింగ్ రంగంలోకి దిగారు. మంగళవారం క్యాంపస్‌ను సందర్శించారు. దీంతో క్యాంపస్‌లో చాలా దిగ్భ్రాంతికర విషయాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. క్యాంపస్ నుంచి అదృశ్యమైన ప్రొఫెసర్లు, స్థానికులు ఎవరో గుర్తించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
అంతేకాకుండా యూనివర్సిటీలోనే ఉంటూ ఇంత పెద్ద స్థాయిలో ఉగ్రదాడులకు వైద్యుల బృందం ఎలా ప్లాన్ చేయగలిగిందో ప్రధానంగా దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. క్యాంపస్ భద్రత, పర్యవేక్షణపై దర్యాప్తు చేయాలని సూచించారు. పైగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, అలాగే విశ్వవిద్యాలయం చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన చాలా మంది స్థానికుల ఆచూకీ లభించడం లేదు. పైగా ప్రొఫెసర్లు ఎవరు కూడా అడ్మినిస్ట్రేషన్‌కు సమాచారం ఇవ్వకుండానే అదృశ్యమయ్యారు. వాళ్లంతా సమాచారం ఇవ్వకుండానే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో.. సమీప గ్రామస్తులు కూడా సడన్‌గా ఎందుకు అదృశ్యమయ్యారో ఈ వివరాలన్నీ సేకరించాల్సిదిగా డీజీపీ ఆదేశించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే.. ఈ కుట్రలో ఇంకా ప్రొఫెసర్లు, స్థానికుల పాత్ర కూడా ఉన్నట్లుగా దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. వీళ్ల ఆచూకీ లభిస్తే.. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఇంకేమీ కుట్ర జరిగిందో బయటపడనుంది.`
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!