ఏపీ ప్రభుత్వం గ్రామీణ, జిల్లా స్థాయిలో ఉత్పాదకత పెంచడం, వ్యాపార, ఉపాధి అవకాశాలు పెంచడం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఒకే చోట కలిసి పని చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో కో-వర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కో-వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోమ్‌తో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.