సాధారణంగా రోడ్లు వేసేటప్పుడు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించే సమయంలో చెట్లు అడ్డుగా ఉంటే ఏం చేస్తారు? దాన్ని నరికి పక్కన పారేస్తారు. ఇదే సులభమైన పని కదా.. కానీ.. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు చెట్టుకు ప్రాణప్రతిష్ట చేశారు. రోడ్డుపై ఉన్న భారీ వృక్షాన్ని వేళ్ళతో సహా పెకిలించి, మరోచోట నాటారు. భారీ క్రేన్ల సహాయంతో చెట్టును తరలించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ వినూత్న ప్రయత్నం సఫలీకృతం కావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో…