కోయంబత్తూర్‌లోని బోచే ఫుడ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహించింది. ఈ ఛాలెంజ్లో బుధవారం వందలాది మంది పాల్గొన్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ ఎలా ఉందంటే.. 30 నిమిషాల్లో 6 ప్లేట్ల బిర్యానీ తినాలి. అలా తిన్న వారికి లక్ష రూపాయల బహుమతిని గెలుచుకోవచ్చని ఆ రెస్టారెంట్ ప్రకటించింది.