ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తనింబర్ దీవుల ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది.
ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్‌లో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం మధ్యాహ్నం 12:17 గంటలకు భూకంపం సంభవించినట్లుగా తెలిపింది.