పొట్టివాడైనా మహా గట్టివాడు చంద్రమోహన్. ఆదివారంతో 81 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రమోహన్ ఇకపై నటనకు దూరంగా ఉంటానంటున్నారు. 1966లో రంగులరాట్నం నుంచి ఇప్పటి వరకూ తన 55 ఏళ్ళ కరీర్ లో దాదాపు 930కి పైగా సినిమాల్లో నటించారు చంద్రమోహన్. ఇటీవల కాలంలో అరుదుగా తెరపై కనపించిన చంద్రమోహన్ ఇక దర్శకనిర్మాతలను ఇబ్బంది పెట్టదలచుకోలేదంటున్నారు. హీరోగా కెరీర మొదలెట్టి సహాయపాత్రలు, క్యారెక్టర్ రోల్స్ లో, కామెడీ పాత్రల్లో తెలుగువారికి కనువిందు చేశారు. ‘రాఖీ’ తర్వాత బైపాస్…