మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. రాష్ట్రంలోని చంద్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివాజీ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే.. రాత్రి శివాజీ పాటిల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటిల్ గాయపడ్డారు. ఊరేగింపులో పాల్గొన్న కొందరు మహిళలు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మహాగావ్‌లో శివాజీ పాటిల్ విజయం సాధించిన తర్వాత కొందరు మహిళలు ఆయనకు హారతి ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.