Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కుమార్ హీరాణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.