రాష్ట్రవ్యాప్తంగా ఒక నగర పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గంలో ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. తాజాగా హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. కుప్పం నగర పంచాయితీ ఎన్నికల్లో ప్రచారంపై స్థానిక డీఎస్పీ విధించిన ఆంక్షలను తప్పు పట్టింది హైకోర్టు. తన అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఇచ్చిన సర్క్యులర్‌ని కొట్టిపారేసింది హైకోర్ట్. ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఆంక్షలపై హైకోర్టులో లంచ్ మోషన్…