డ్రగ్స్ కేసులో ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నార్కోటిక్ అధికారులు మోహిత్ ను ప్రశ్నించనున్నారు. ఎడ్విన్తో సంబంధాలపై కూపీ లాగనున్నారు. మోహిత్ కు 50 మంది ప్రముఖులతో కాంటాక్టులు ఉన్నాయని భావిస్తున్న అధికారులు వీటిపై ఆరా తీయనున్నారు.
గోవా కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తోన్న కేసులో అరెస్టైన కీలక నిందితుడు ఎడ్విన్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. మత్తుమాఫియా మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్‌ను పోలీసులు అరెస్టుచేసి 10రోజులు గడవముందే బెయిల్‌పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.