Drug Supplier Mohit: డ్రగ్స్ కేసులో ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నార్కోటిక్ అధికారులు మోహిత్ ను ప్రశ్నించనున్నారు. ఎడ్విన్తో సంబంధాలపై కూపీ లాగనున్నారు. మోహిత్ కు 50 మంది ప్రముఖులతో కాంటాక్టులు ఉన్నాయని భావిస్తున్న అధికారులు వీటిపై ఆరా తీయనున్నారు. మోహిత్ ను ఒకరోజు కస్టడీకి నాంపల్లి కోర్టు నిన్న అనుమతి ఇచ్చింది. అటు డ్రగ్స్ కేసులో మరో నిందితుడు కృష్ణ కిషోర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read also: Pathaan Controversy: ఆలు లేదు చూలు లేదు.. అంతా తుస్!
ప్రముఖ హీరోయిన్ నేహాదేశ్ పాండే మోహిత్ భర్త మోహిత్ ను డ్రగ్స్ సప్లై చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. కాగా.. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. భాగ్యనగరంతో పాటు.. గోవా, ముంబైలో డ్రగ్స్ సరఫరా చేసేవారితో మోహిత్ కు పరిచయాలున్నాయి.సినీ ప్రముఖులకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు అధికారులు. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన మోహిత్ ఓ పబ్ లో వెయిటర్ గా పనిచేసేవాడు. రాను రాను పరిచయాలు పెంచుకుని తను డ్రగ్స్ సప్లైర్ గా మారాడు. బడాబాబులతో పరిచయాలు వారికి డ్రగ్స్ సప్లై చేస్తూ పెరిగాడు. ఆవిధంగా.. ఓసాధారణ వెయిటర్ స్థానం నుంచి ఓ హీరోయిన్ కు భర్త అవ్వటమేకాకుండా తన డ్రగ్స్ దందాను పెంచుకున్నాడు.
Read also: Selfie With Monkeys: కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోయలో..
ఇక..మన్యం కృష్ణ కిషోర్ రెడ్డితోపాటు ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ మేనేజర్ గా కొనసాగుతున్నాడు మోహిత్. అంతేకాదు..కృష్ణ కిషోర్ రెడ్డి ఏపీ మాజీ మంత్రికి సమీప బంధువు కూడా.. కృష్ణ కిషోర్ రెడ్డి, మోహిత్ ను అరెస్ట్ చేసిన అధికారులు వీరిద్దరి నుంచి పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకన్నారు. అయితే.. కృష్ణ కిషోర్ రెడ్డి బస్సుల్లో హైదరాబాద్‌కు డ్రగ్స్ తెప్పిస్తున్నట్టుగా పోలీసులకు గుర్తించినట్లు తెలుస్తుంది. న్యూ ఇయర్‌కు సెలబ్రేషన్స్‌కు ముందే మోహిత్ డ్రగ్స్‌తో హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక, మోహిత్ భార్య నేహా దేశ్ పాండే తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే.. మోహిత్ కాంటాక్ట్స్‌లో ఉన్న వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులకు, బడా బాబుల పిల్లలకు కొకైన్ సరఫరా చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. ఇక మెహిత్ విచారణతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Madrasa teacher: మదర్సాలో కీచక టీచర్.. విద్యార్థుల అసభ్యకర వీడియోలు తీసి..