Mithun Reddy : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయని, పోలవరం అంశంపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు మిథున్ రెడ్డి.…