Andhra Pradesh: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వచ్చిన ఆమె.. ఈసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 4న ఢిల్లీ నుంచి ఆమె విజయవాడ చేరుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వివరాలను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా వెల్లడించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ప్రత్యేక…