Droupadi Murmu Visits Tirumala: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇవాళ ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ అర్చకులు.. ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఇక, శ్రీవారిని దర్శించుకన్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు అర్చకులు వేదాశీర్వచనాలిచ్చి.. తీర్థప్రసాదాలను అందజేశారు.…