Droupadi Murmu Visits Tirumala: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇవాళ ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ అర్చకులు.. ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఇక, శ్రీవారిని దర్శించుకన్న తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు అర్చకులు వేదాశీర్వచనాలిచ్చి.. తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు..
Read Also: Earthquake: బంగ్లాదేశ్, కోల్‌కతాలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. రాంభగీచ సర్కిల్ వద్ద ప్రోటోకాల్ పక్కన పెట్టేసి భక్తులను పలకరించారు రాష్ట్రపతి ముర్ము.. కాన్వాయ్ నుంచి దిగి రోడ్డు పక్కన నిలిచిఉన్న భక్తులను ప్రేమగా పలకరించిన రాష్ట్రపతి.. భక్తులతో కరచాలనం చేసి చాక్లెట్స్ పంపిణీ చేశారు.. ఇక, ఊహించని ఘటనతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. అయితే, రాష్ట్రపతి అనూహ్యంగా కాన్వాయ్ దిగడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటన భాగంగా.. గురువారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆ తర్వాత తిరుమల చేరుకుని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేశారు.. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు..