కరువు ప్రభావిత మండలాలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల పరిధిలో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ నిశితంగా పరిశీలించింది.