మోటారు వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. ఇవాళ ఉదయం నుంచి వారు ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు. పెద్దఎత్తున బారులు తీరారు. అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో యథావిధిగా బంకులకు పెట్రోల్ సరఫరా కానుంది. ఇది వాహనదారులకు ఊరట కలిగించనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్…
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మె సైరన్ మోగింది. బస్సు డ్రైవర్ల సమ్మె కారణంగా శనివారం తెల్లవారుజాము నుంచే ఇతర ప్రాంతాలతో పాటు గ్రామాలకు వెళ్లే అద్దె బస్సులు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కరీంనగర్ కు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.