ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. మంగళవారం విజయవాడలో జరిగిన వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు.