Delhi Car Blast: ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద కారు బాంబ్ దాడి జరగడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ‘‘ఆపరేషన్ సిందూర్’’ మళ్లీ మొదలైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతుున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మదే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన ఇద్దరు సహచరులతో కలిసి ప్లాన్ చేసినట్లు తెలిపాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్‌ను ఉమర్ వాడాడు. పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడుకు కారణమైన ఐ20 కారు కదలికలపై దర్యాప్తు సంస్థలు కీలక…