Manmohan Singh: భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపై దేశం మొత్తం నివాళులు అర్పిస్తోంది. ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ఆర్థికవేత్తగా కొనియాడుతోంది. ఆయన మరణం పట్ల ప్రపంచదేశాధినేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతిపై భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా తెలియజేశారు.
భారత మాజీ ప్రధాని,కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఈ గురువారం తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘మన దేశం ఇప్పటివరకు సృష్టించిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు, ఉన్నత విద్యావంతులు, మృదుస్వభావి మరియు వినయపూర్వకమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ. ఆర్థిక మంత్రిగా ఆయన…