Monu Manesar: వివాదాస్పద గోసంరక్షుడు మోనూ మనేసర్ ని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తలను హత్య చేశాడని, జూలై నెలలో హర్యానాలో నూహ్ ప్రాంతంలో మతకలహాలు పెరిగేందుకు కారకుడయ్యాడనే అభియోగాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో హర్యానాలో కారులో ఇద్దరు ముస్లింల శవాలు కాలిపోయన స్థితితో బయటపడ్డాయి. ఈ ఘటనలో మనేసర్ కీలక నిందితుడిగా ఉన్నాడు.
Hyderabad Crime: హైదరాబాద్ లోని టప్పాచబుత్ర, దైబాంగ్ లో ఇద్దరు హిజ్రాలు దారుణ హత్యకు గురయ్యారు. కత్తి, బండరాళ్లతో మోది ఇద్దరు ట్రాన్స్ జండర్లను హత్య చేశారు దుండగులు. స్థానిక సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని అమ్మటివారి పాలెంలో జరిగిన జంట హత్యల కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. తల్లి షేక్ మీరా, కొడుకు షేక్ అలిఫ్ లని మండలంలోని పొలంపాడు గ్రామానికి చెందిన రబ్బానీ హత్య చేసినట్లుగా కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. ఒకే రోజు ముగ్గురి హత్యకు నిందితుడు రబ్బానీ ప్రణాళికల రూపొందించినట్లు కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. కలిగిరిలో షేక్ మీరా, ఆమె కుమారుడు షేక్ అలిఫ్ ను హతమార్చిన…