ఆవులు, గేదెల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులను మీరు చూసి ఉంటారు. అయితే అంతకుమించి డబ్బులు సంపాదిస్తున్నాడు ఓ రైతు. కానీ అది ఆవులు, గేదెల పెంపకంతో కాదు.. గాడిదల పెంపకంతో. గాడిదలను వస్తువులను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వీటి పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు. ఎందుకంటే గాడిద పాలకు ప్రపంచంలో అత్యంత ఖరీదు ఉంది.
గాడిద చర్మాలు సహా వివిధ వస్తువులను చైనాకు ఎగుమతి చేసే ప్రతిపాదనలకు పాకిస్థాన్ సర్కార్ ఆమోద ముద్ర వేసింది. పాకిస్థాన్ నుంచి పశువులు, పాల ఉత్పత్తులు, మిరపకాయలు, గాడిద చర్మాలను డ్రగన్ కంట్రీకి ఎగుమతి చేసే ప్రతిపాదనలను పాక్ ఫెడరల్ క్యాబినెట్ సర్క్యులేటింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భారత్‌లో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు అంటే 8 ఏళ్ల కాలంలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు బ్రూక్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు వివరాలను సేకరించారు. దేశంలో అక్షరాస్యత రేటు పెరగడం, బరువు మోయడానికి గాడిదలను వాడే ఇటుక పరిశ్రమలలో యంత్రాలు అందుబాటులోకి…