అంతర్జాతీయ వేదికపై తమకు అండగా నిలుస్తున్న చైనాపై పాకిస్థాన్ మరోసారి తన భక్తిని చాటుకుంది. గాడిద చర్మాలు సహా వివిధ వస్తువులను చైనాకు ఎగుమతి చేసే ప్రతిపాదనలకు పాకిస్థాన్ సర్కార్ ఆమోద ముద్ర వేసింది. పాకిస్థాన్ నుంచి పశువులు, పాల ఉత్పత్తులు, మిరపకాయలు, గాడిద చర్మాలను డ్రగన్ కంట్రీకి ఎగుమతి చేసే ప్రతిపాదనలను పాక్ ఫెడరల్ క్యాబినెట్ సర్క్యులేటింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: WeWantJusticeForShyamNTR: శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు.. ఏమన్నారంటే..?
గాడిద చర్మాలను ప్రాసెసింగ్ కోసం చైనాకు పంపనున్నట్లు పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. పాక్ నుంచి గాడిదలు, కుక్కలను దిగుమతి చేసుకోవడానికి డ్రగన్ కంట్రీ ఆసక్తిని ప్రదర్శించినట్లు పాక్ వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొనింది. కుక్కలతో పాటు గాడిదలను కూడా ఎగుమతి చేయాలని చైనా.. పాకిస్థాన్‌ను అభ్యర్థిస్తోందని ఆ దేశ స్టాండింగ్ కమిటీ సభ్యుడు దినేష్ కుమార్ వెల్లడించారు.
Read Also: Surendra Reddy : ఆ మెగా హీరోతో సినిమా చేయబోతున్న సురేంద్ర రెడ్డి..?
అయితే, పాకిస్తాన్ నుంచి గాడిదలు మరియు కుక్కలను దిగుమతి చేసుకోవడానికి చైనా ఆసక్తి చూపడంతో అక్టోబర్ 4, 2022న వాణిజ్యంపై సెనేట్ స్టాండింగ్ కమిటీకి తెలియజేసింది. చైనీయులు గాడిద చర్మం యొక్క విలువను మరియు దాని నుంచి ఉత్పన్నమయ్యే ఉత్పత్తుల కోసం ఆఫ్రికా మరియు పాకిస్థాన్ నుంచి గాడిదలను కొనుగోలు చేస్తుంది.
Read Also: Coconut Burfi : కొబ్బరి బర్ఫిని ఇలా చేసుకోవచ్చు.. టేస్ట్ చూస్తే వదలరు…!
అయితే చైనాలో గాడిదలకు అత్యధికంగా డిమాండ్ ఉండటం వల్లే పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. చైనీస్ గాడిదల పెంపకందారులు మార్కెట్ డిమాండ్‌ను తీర్చడంలో విఫలమయ్యారు.. దీని ఫలితంగానే ఆఫ్రికా-పాకిస్తాన్ వంటి ఇతర దేశాల నుంచి గాడిదలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని డ్రాగన్ దేశ అధికారులు తెలియజేస్తున్నారు.