తొలిసారి దర్శకత్వం వహించే దర్శకులకు సవాలక్ష సమస్యలు ఉంటాయి. నిర్మాతకు కథ చెప్పి ఒప్పించడం ఒక ఎత్తు అయితే కథానాయకుడిని మెప్పించడం మరో ఎత్తు. అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న విధంగా సినిమా రూపొందించాలంటే… అతనికి వెన్నుదన్నుగా నిలవాల్సింది ప్రధానంగా ఛాయాగ్రాహకుడు. దర్శకుడి మనసులోని ఆలోచనలను గ్రహించి, దానికి అనుగుణంగా అందంగా సన్నివేశాలను కెమెరాలో బంధించాల్సింది ఆయనే. అందువల్లే దర్శకుడు, ఛాయాగ్రాహకుడి బంధం భార్యభర్తల వంటిదని సినిమా పెద్దలు చెబుతుంటారు. ఇక తొలిసారి మెగాఫోన్ పట్టుకునే డైరెక్టర్స్…