Donald Trump: ఒక నేరస్థుడికి శిక్ష పడిన మొదటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. హుష్ మనీ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌కి ఈ రోజు అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే, అతడికి ‘‘షరతులు లేని విడుదల’ శిక్ష విధించబడింది. అంటే, ప్రస్తుతం ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు తన ఆరోపణలకు దోషిగా తేలాడని అర్థం.