సౌరభ్ హత్య కేసుతో పాటు ఔరయ్య, బెంగళూరు హత్యలు కూడా దేశంలో చర్చనీయాంశమవుతున్నాయి. మూడు కేసుల్లోనూ హత్యల సరళి దాదాపు ఒకేలా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సౌరభ్ భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్‌తో కలిసి అతన్ని హత్య చేశారు. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యలో వివాహం అయిన 15 రోజులకే తన భర్త దిలీప్‌ను హత్య చేయడానికి ప్రగతి కుట్ర పన్నింది.
చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ.. HR టెక్ స్టార్టప్ అయిన రిప్లింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సింగపూర్‌కు చెందిన క్రిప్టో సోషల్ నెట్‌వర్క్ 0xPPL.com వ్యవస్థాపకుడు. అతను పెట్టుబడి పెట్టిన స్టార్టప్ కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి ప్రసన్న శంకర్ నారాయణ.. ఇప్పుడు భార్య బాధితుడు అయ్యాడు.
Murder : కుటుంబ బాధ్యతలను పూర్తిగా విస్మరించి, మద్యం వ్యసనానికి బానిసైన ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. మద్యం కొరకు ప్రతిరోజూ భార్యను డబ్బుల కోసం వేధిస్తున్న భర్త, ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన గ్రామాన్ని షాక్‌కు గురి చేసింది. షాద్‌నగర్ పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న కొడుకును, తల్లే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు రాజ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక తల్లి దూడమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకును కాళ్లు కట్టేసి, కొట్టి ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ…
ఇంటి ముందు నిద్రిస్తున్న కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టి హత్యకు ఒడిగట్టింది తల్లి హత్యకు భార్య కూడా సహకరించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మొదట అనుమానాస్పద మృతిగా వందతులు వచ్చినా.. దారుణ హత్య చేశారని పుకార్లు వినిపించాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. తల్లి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. మంగళవారం రాత్రి ఇంటి…
ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు.
హైదరాబాద్‌లోని మేడ్చల్ పరిధి ఈసీఐఎల్ x రోడ్లో దారుణం చోటు చేసుకుంది. తండ్రిపై కత్తితో దాడి చేశాడు ఓ కసాయి కొడుకు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. కత్తితో దాడి చేస్తున్నా స్థానికులు అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. వారం రోజుల్లో మేడ్చల్ పరిధిలో ఇది మూడో మర్డర్. అయితే.. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
Murder : మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచి, చంపాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నట్టు సమాచారం. సీఐ సత్యనారాయణ, సిబ్బంది…
Meerpet Murder Case: మీర్పేట్ న్యూ వెంకటేశ్వర నగర్లో జరిగిన హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించిన భర్త గురుమూర్తి, తన భార్య మాధవిని హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మాధవిని హత్య చేసిన గురుమూర్తి, ఆమె మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూమ్లో కత్తితో ముక్కలుగా చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాత్రూమ్ను పది సార్లు కడిగినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో…
Karnataka : కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి పట్ల కన్న తండ్రే కసాయి వాడయ్యాడు. ముక్కు పచ్చలారని పసి కందును తీసుకెళ్లి బలవంతంగా ముసలోడికి కట్టబెడ్డాడు.