హమ్మయ్య.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకునే శుభవార్త. మూడు రోజులుగా నరకయాతన పడుతున్న ప్రయాణికులకు డీజీసీఏ చెక్ పెట్టింది. నవంబర్ 1 నుంచి విధించిన కొత్త ఆంక్షలను వారం పాటు ఎత్తివేసింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సంక్షోభానికి తెర పడినట్లైంది.
ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మూడు రోజులుగా విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు పడుతున్నట్లు పాట్లు అన్నీ ఇన్నీ కావు. మూడు రోజులుగా విమానాశ్రయాల్లోనే ప్యాసింజర్స్ పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్‌లైన్స్ నుంచి సరైన సమాధానం లేక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.