ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిన్న విజయవాడలోని సింగ్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి.. విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. స్థానిక విద్యార్థినులు తమకు ఆకతాయిలతో ఇబ్బందిగా ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. దీంతో నారా లోకేష్ వెంటనే స్పందించి.. గంటల వ్యవధిలో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే మూడు కెమెరాలు ఏర్పాటు అవ్వగా.. మిగతా రెండు…
బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకూ నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నామని వెల్లడించారు..
ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి.. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పది మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరుతో కూటమి ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిందన్నారు..