Arab-Islamic Summit: ఇటీవల హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఖతార్ రాజధాని దోహాపై విరుచుకుపడింది. హమాస్ నేతలు సమావేశమైనట్లు భావిస్తున్న భవనంపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలను అసలు ఖతార్ ఊహించలేదు. ఈ దాడుల్ని పిరికిదాడులుగా అభివర్ణించింది. ఈ దాడులు, గాజాలో ఇజ్రాయిల్ దాడుల తీవ్రత పెంచిన తర్వాత అరబ్-ఇస్లామిక్ నేతల సమాశానికి దోహా వేదికైంది. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ఇస్లామిక్ దేశాల అధినేతలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కామెంట్స్…
Arab-Islamic Nato: అమెరికా నేతృత్వంలోని ‘‘నాటో’’ తరహా సైనిక కూటమికి అరబ్-ఇస్లామిక్ దేశాలు సిద్ధమవుతున్నాయా..? అంటే, ఇందుకు కొన్ని దేశాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పాకిస్తాన్, దాని మిత్ర దేశం టర్కీలు ‘‘ అరబ్-ఇస్లామిక్’’ సైనిక కూటమి కోసం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల, ఖతార్‌పై హమాస్ అగ్రనాయకత్వమే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో, ఇజ్రాయిల్‌ను అడ్డుకోవడానికి నాటో తరహా కూటమి కట్టాలని ఇస్లామిక్, అరబ్ దేశాలు భావిస్తున్నాయి.