Dog Meat Row: బెంగళూర్‌లోని పలు రెస్టారెంట్, హోటళ్లకు మటన్ బదులుగా కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న మాంసాన్ని విశ్లేషించేందుకు ఫుడ్ లేబోరేటరీకి పంపారు. ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని శనివారం ప్రభుత్వం ప్రకటించింది.