శుక్రవారం రాత్రి జైపూర్ నుంచి బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు రైలులో వచ్చిన మాంసం కుక్కలది కాదు, గొర్రెలదేనని రుజువైంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన మాంసం నమూనాల పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ కేసులో రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం సృష్టించిన గోసంరక్షకుడు, అతని సహచరులు, మాంసం రవాణా చేస్తున్న వారిపై సహా మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బెంగళూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం భారీగా మాంసం లభించడంతో కలకలం రేగింది.
Dog Meat Row: బెంగళూర్‌లోని పలు రెస్టారెంట్, హోటళ్లకు మటన్ బదులుగా కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న మాంసాన్ని విశ్లేషించేందుకు ఫుడ్ లేబోరేటరీకి పంపారు. ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని శనివారం ప్రభుత్వం ప్రకటించింది.
Dog Meat: శతాబ్ధాలుగా వస్తున్న సంప్రదాయానికి దక్షిణ కొరియా స్వస్తి పలకనుంది. కొన్నేళ్లుగా దక్షిణ కొరియాలోని ప్రజలు కుక్క మాంసాన్ని తింటున్నారు. అయితే ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని అధికార పీపుల్ పవర్ పార్టీ ఈ ఏడాది చివరి నాటికి కుక్క మాంసం వినియోగంపై నిషేధాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. కుక్క మాంసం వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ముఖ్యంగా యువతరాల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. అలాగే…
కుక్క మాంసం ఎగుమతులు, విక్రయాలపై నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు కొట్టేసింది. వాణిజ్య అవసరాల కోసం కుక్కల దిగుమతి, వాటితో వర్తకం, రెస్టారెంట్లలో వాణిజ్య ప్రాతిపదిక, వాటి మాంసం విక్రయాలను నిషేధిస్తూ నాగాలాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిషేధ ఉత్తర్వులు జారీ చేయడానికి చీఫ్ సెక్రటరీ తగిన వ్యక్తి కాదని గౌహతి కోర్టు తెలిపింది.
Bihar: బీహార్ లో జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ వివాదాస్పదం అయింది. జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ తన కార్యకర్తలకు మటన్ రైస్ తో విందు ఏర్పాటు చేశారు. ముంగేర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ నాయకుడు చేసిన విమర్శలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జేడీయూ అధ్యక్షుడు విందు ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ఆ ప్రాంతంలో వందలాది కుక్కలు కనిపించడం లేదని బీజేపీ ఆరోపించారు.