కుక్క మాంసం ఎగుమతులు, విక్రయాలపై నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు కొట్టేసింది. వాణిజ్య అవసరాల కోసం కుక్కల దిగుమతి, వాటితో వర్తకం, రెస్టారెంట్లలో వాణిజ్య ప్రాతిపదిక, వాటి మాంసం విక్రయాలను నిషేధిస్తూ నాగాలాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిషేధ ఉత్తర్వులు జారీ చేయడానికి చీఫ్ సెక్రటరీ తగిన వ్యక్తి కాదని గౌహతి కోర్టు తెలిపింది. ఈ నిషేధాన్ని 2020 నవంబర్ లోనే సింగిల్ బెంచ్ ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది.
Read Also : Group-1 Prelims Exam: రేపు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. షూ వేసుకుంటే నో ఎంట్రీ
ఇదే కేసుపై హైకోర్టు కోహిమా బెంచ్ జస్టిస్ మర్లి వంకున్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు కూడా చెప్పింది. కుక్కల మాంసం విక్రయాల విషయంలో కేబినెట్ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. కోహిమా మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో శునకాలతో వ్యాపారం నిర్వహించే లైసెన్స్‌డ్ వర్తకులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు. ఆహార భద్రత చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు హైకోర్టుకు వారు విన్నవించారు.
Read Also : Fixed Deposit Rates: ఫిక్స్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 10 బ్యాంకులేవో తెలుసా ?
అయితే ఇటీవలే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వానికి కానీ.. సీఎస్ కు వర్తకం చేసే హక్కులకు భంగం కలిగించకూడదని గౌహతి ధర్మసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం పిటిషనర్ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినందుకు మరియు సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతువులు అనే నిర్వచనం కింద శునకాలను పేర్కొనని విషయాన్ని జడ్జి లేవనెత్తారు. శునకాల వర్తకంతో పిటిషనర్లు ఆదాయం ఆర్జిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ వారికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారు.