తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జెండా ఎగురవేయడం ఖాయం అని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణను పుర్తిగా మోసం చేశాడని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశాడని మండిపడ్డారు. అనుభవం లేని పరిపాలన రేవంత్ రెడ్డిది అని డీకే అరుణ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా…
జనగామ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను తిట్టి సీఎం అయితే.. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని తిట్టి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు.
DK Aruna : ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యార్థుల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ, ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయనే విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల కితం షాద్‌నగర్‌లో నీరజ్ అనే విద్యార్థి పాఠశాలపై నుంచి దూకి మృతి చెందగా, తాజాగా బాలానగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని…
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాజెక్టు తీసుకురావడంలో తన పాత్రను గుర్తు చేస్తూ అరుణ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును తెచ్చింది నేనే.. మా నాన్న పాలమూరు కోసం అనేక పోరాటాలు చేశారు, మా కుటుంబం జిల్లా కోసం ప్రాణాలు అర్పించిందని తెలిపారు. వారిని గుర్తుచేసే…
న్యూ ఇయర్ వేడుకలపైకి దూసుకెళ్లిన కార్, కాల్పులు.. 10 మందికి పైగా మృతి..! అమెరికాలో న్యూ ఓర్లీన్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్‌విల్లే కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనాలపైకి ట్రక్ దూసుకెళ్లింది. ఈ సంఘటన తెల్లవారుజామున 3:15 గంటల…
DK Aruna : మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సమస్యలు చాయ్ తాగినంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పిన వారే ఇప్పుడు ఏమి చేస్తున్నారు? అని ఆమె ఎద్దేవా చేశారు. బుధవారం గద్వాలలో 23 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న సర్వశిక్షా అభియాన్ (SSA) ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె, వీరి డిమాండ్లకు పూర్తిగా మద్దతు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, “సర్వశిక్షా అభియాన్…
DK Aruna : సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజను బీజేపీ ఎంపీ డీకే. అరుణ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుని, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన దురదృష్టకరమని, ఒకరి మరణం, మరొకరి తీవ్ర గాయపడడం బాధకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని, సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి…
DK Aruna : ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంతా రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా…
DK Aruna : బీజేపీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నీటిని శుద్ధి చేసి మంచి నీటిగా మార్చాలని తమకు వ్యతిరేకం లేదు అని ఆమె స్పష్టం చేశారు. అయితే, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రణాళికను మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆమె…