DK Aruna: ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో బౌన్సర్ లను పెట్టుకుని తిరిగిన ఏకైక రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి అని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కాకముందు అయన బౌన్సర్ లను పెట్టుకుని తిరగలేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుదేలు అయింది … సినీ ఇండస్ట్రీ నీ ఇక్కడి నుండి పంపించే కుట్ర జరుగుతుందన్నారు. అల్లు అర్జున్ ఇంట్లో పిల్లలని భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేశారన్నారు.
Read also: Allu Arjun Question Hour: క్వశ్చన్ అవర్.. అల్లు అర్జున్‌ని విచారించనున్న అంశాలు ఇవే..
అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ అని తెలిపారు. అంబేద్కర్ గురుంచి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. మేము కూడా ప్రజల్లోకి వెళ్తామన్నారు. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో వివరిస్తామని తెలిపారు. అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడితే… కాంగ్రెస్ ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడలేదన్నారు. రాహుల్ గాంధీ లోక్ సభలో ఎందుకు ప్రస్తావించలేదు? అని డీకే అరుణ ప్రశ్నించారు.
Daggubati Purandeswari: అంబేద్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ: పురందేశ్వరి