తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో దశ నేడు పాలమూరు గడ్డపై ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. తెలంగాణ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ అడుగడుగునా మోసం చేశారని, ఇచ్చిన హామీల్ని ఏమాత్రం నెరవేర్చలేదని అన్నారు. ఇక్కడి ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు తాను కాపలా కుక్కలా ఉంటానని, ప్రాజెక్టుల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానని మాటిచ్చాడని, కానీ ఇప్పుడా హామీల్ని తుంగలో తొక్కేశాడని…