Diya Kumari: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ సంచలన వ్యక్తిని ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మని సీఎంగా ఎంపిక చేసింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా రాజకుటుంబ నేపథ్యం ఉన్న దియా కుమారిని, ఎస్సీ వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైర్వాలు ఎన్నికయ్యారు. అయితే, ముందుగా మాజీ సీఎం వసుంధర రాజేని స్థానంలో దియాకుమారి సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. చివరకు ఉపముఖ్యమంత్రి పదవి దియాకుమారిని వరించింది.
తాజ్ మహల్ కట్టింది మా స్థలంలోనే అంటున్నారు బీజేపీ ఎంపీ దియా కుమారి.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.. దీంతో, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైనా తాజ్ మహల్.. మరోసారి వార్తల్లో నిలిచినట్టు అయ్యింది.. బీజేపీ ఎంపీ మరియు జైపూర్ మాజీ యువరాణి అయిన దియా కుమారి.. తాజ్ మహల్ నిర్మించిన భూమి వాస్తవానికి మా కుటుంబానికి చెందినదని పేర్కొన్నారు. జైపూర్ రాజకుటుంబం భూమిపై దావా వేసినట్లు తన వద్ద పత్రాలు…