Taj Mahal: మా స్థలంలోనే తాజ్ మహల్ కట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజ్ మహల్ కట్టింది మా స్థలంలోనే అంటున్నారు బీజేపీ ఎంపీ దియా కుమారి.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.. దీంతో, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైనా తాజ్ మహల్.. మరోసారి వార్తల్లో నిలిచినట్టు అయ్యింది.. బీజేపీ ఎంపీ మరియు జైపూర్ మాజీ యువరాణి అయిన దియా కుమారి.. తాజ్ మహల్ నిర్మించిన భూమి వాస్తవానికి మా కుటుంబానికి చెందినదని పేర్కొన్నారు. జైపూర్ రాజకుటుంబం భూమిపై దావా వేసినట్లు తన వద్ద పత్రాలు ఉన్నాయని స్పష్టం చేశారు.. హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేయడానికి తాజ్ మహల్‌లోని 22 తాళం వేసిన గదులను పరిశీలించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని కోరుతూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దియా కుమారి ఈ వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు.
పిటిషన్‌కు మద్దతుగా ఎంపీ దియా కుమారి మాట్లాడుతూ.. స్మారక చిహ్నం నిర్మించడానికి ముందు అక్కడ ఏమి ఉందో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ‘మక్బరా’కు ముందు అసలు ఏముందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్న ఆమె.. మా కుటుంబం వద్ద రికార్డులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే వీటిని అందజేస్తామని తెలిపారు. మొఘల్ పాలకుడు షాజహాన్ తన కుటుంబానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకున్నాడన్న ఆమె.. ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్ చేసుకునే అవకాశం లేదనే విషయం అందరికీ తెలుసని. ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలుస్తుందన్నారు.
Also Read
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
కాగా, తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ కోసం సమాధిగా నిర్మించాడు. 1631లో నిర్మాణాన్ని ప్రారంభించారు.. ఈ పాలరాతి స్మారక చిహ్నం నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది.. 22,000 మంది కార్మికులు 1653లో తాజ్ మహల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే, షాజహాన్ తన భార్య సమాధిగా మార్చుకున్న ప్రాంతంలో శివాలయం ఉండేదని కోర్టులో పిటిషన్ దాఖలైంది.. చాలా కాలంగా మూతపడిన తాజ్‌మహల్‌లోని 22 గదులను తెరిచేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్వే చేయించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.. అయోధ్యలోని బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌లో, సమాధి నిజానికి పాత శివాలయం అని కొంతమంది చరిత్రకారులు, హిందూ సంఘాల వాదనలను ఉదహరించారు. తాళం వేసి ఉన్న గదులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నివేదికను ప్రజలకు అందించాలని ఏఎస్‌ఐని పిటిషన్‌లో కోరారు.
అయితే, తాజ్‌మహల్‌ను దేవాలయంగా మార్చడం కాదు.. కానీ, సామాజిక సామరస్యానికి సంబంధించిన వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రజనీష్ సింగ్.. ఇలాంటి వివాదాలకు తెరపడాలంటే మూసి ఉన్న తలుపులను పరిశీలించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. తాజ్ మహల్ పై ఇప్పటికే వెలుగులో ఉన్న వివాదాల ప్రకారం.. 1965లో, చరిత్రకారుడు పీఎన్ ఓక్ తన పుస్తకంలో తాజ్ మహల్ నిజానికి ఒక శివాలయం అని పేర్కొన్నాడు. 2015లో తాజ్ మహల్‌ను ‘తేజోమహలే’గా ప్రకటించాలని ఆగ్రాలోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక, తాజ్ మహల్‌ను తేజోమహల్‌గా ప్రకటించాలని 2017లో బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ దియా కుమారి చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది తాజ్ మహల్.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..