దీపావళి బోనస్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పండుగ రానే వచ్చింది. కానీ బోనస్ మాత్రం అకౌంట్లలో పడలేదు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులకు చిర్రెత్తింది. డ్యూటీ పక్కన పెట్టి నిరసనకు దిగారు. అంతేకాకుండా అన్ని టోల్ గేట్లు ఎత్తేసి ఉచితంగా విడిచిపెట్టేశారు. దీంతో ఒక్కసారిగా యాజమాన్యం దిగొచ్చి కాళ్లబేరానికి వచ్చింది.
Yogi Adityanath: దీపావళికి ముందు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పండుగ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే జైలు పాలు కావడం ఖాయమన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని.. వెంటనే జైలులో పెడతామని హెచ్చరించారు. పండుగలు, వేడుకలను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని సీఎం యోగి సూచించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లోని అన్ని సమాజిక వర్గాలకు చెందిన ప్రజలు పండుగలను శాంతియుతంగా జరుపుకున్నారన్నారు. ఇది అల్లర్లకు తలొగ్గే ప్రభుత్వం కాదన్నారు.
Diwali Bonus For Railway Employees: కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని., మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో కొత్తగా 3 కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మిగితా సగం రాష్ట్రం…
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం దీపావళి బోనస్ ఇవ్వడానికి నిరాకరించినందుకు దాబా యజమానిని అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి బోనస్‌ను ఇవ్వడానికి యజమాని తిరస్కరించడంతో శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలోని కుహి ఫాటా సమీపంలోని ధాబా వద్ద అతని ఉద్యోగులు గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.