ఉత్తరప్రదేశ్‌లోని ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’ ను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరం మొత్తాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2019లో ఈ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూసేకరణ జరిపి, మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో…