జాన్ అబ్రహమ్ ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్రలు చేసిన సినిమా ‘సత్యమేవ జయతే -2’. 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ లైన్ లోనే ఈ సినిమా కూడా రూపుదిద్దుకుంది. అంతేకాదు… అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమాను దర్శకుడు మిలాప్ జవేరీ తెరకెక్కించాడు. యాక్షన్, కరెప్షన్, పాలిటిక్స్, పోలీస్ పవర్, ఫార్మర్స్ ఇష్యూ…. ఇలా అనేక అంశాలను మోతాదుకు మించి ఈ సినిమా కథలో ఇమిడ్చారనే విషయం సోమవారం విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.…