Farmers High Alert: దిత్వా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో, రైతుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఇప్పటికే కృష్ణా జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.