Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా సోమవారం నాడు అన్ని జిల్లాల కేంద్రాల్లో టీచర్స్ ఫెడరేషన్ నిరసనలు చేపట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు వెల్లడిచారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఫించనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని.. దాచుకున్న డబ్బును కూడా తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలు చేయకుండా పోలీసులు భయాందోళనకు గురిచేస్తున్నారని టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు విమర్శలు చేశారు.…
హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్‌లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు…