కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ (కేంద్ర విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ) సమావేశానికి స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.