Phone In Toilet: చాలా మందికి టాయిలెట్ సీటుపై కూర్చుని పేపర్ చదివే అలవాటు ఉంటుంది. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లి గంటల తరబడి అందులో కూర్చుని గడుపుతుంటారు.
ఇటీవల కాలంలో చాలామంది ఒంటరి జీవితాన్ని బతకడానికే మొగ్గుచూపుతున్నారు. అలాగే 30 నుంచి 40 ఏళ్లు దాటిన వారు కూడా పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే పెళ్లిచేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది.
జీవనాధారం తాగునీరు. ఏ జీవి అయినా ముందుగా తాగేందుకు నీటి కోసం చూస్తుంది. మనుషులైతే నీరు ఎక్కడ దొరుకుతుందోనని ఎదురుచూస్తుంటాడు. అల్లూరిసీతారామరాజు జిల్లా అరకులోయ పర్యాటకులకు స్వర్గథామం. అయితే అక్కడ వుండే స్థానికులకు మాత్రం ప్రకృతి అందాలు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. తాగేందుకు నీరుంటే వారికి చాలు. అరకులోయ మండలం బస్కీపంచాయతీ రంగినిగూడ గ్రామస్తుల దుస్థితి అంతా ఇంతా కాదు. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క వారు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడంలేదు. తాగునీటి సమస్య పరిష్కారం…
పారిశ్రామికీకరణతో ఉద్యోగాలు వస్తాయని భావించినవారికి నిరాశే ఎదురైంది. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఎస్ఎన్ఎస్ కంపెనీ వెదజల్లుతున్న వ్యర్ధాలతో వాయు కాలుష్యం నీటి కాలుష్యం వల్ల పోరాటాలు చేసి అలిసిపోయి బ్యూరోక్రాట్స్ ముందు నిరసన తెలుపుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఎస్ఎన్‌ఎస్ అనే పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీ వ్యర్థాలతో దుర్వాసనతో చుట్టుపక్కల ఉన్న…
ప్రపంచంలో ఎన్నో వింతైన వ్యాధులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ప్రస్తుతం కరోనాతో యావత్ ప్రపంచం ఇబ్బందులు పడుతున్నది. రెండేళ్లుగా ప్రజలు సరిగా పనులు చేసుకోలేకపోతున్నారు. థర్డ్ వేవ్ సమయంలో ప్రజలను ఈ మహమ్మారి మరింతగా ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో కొన్ని అరుదైన వ్యాధులు కూడా ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. అందులో కొరియా వ్యాధి కూడా ఒకటి. వ్యక్తి ప్రమేయం లేకుండా శరీరంలోని అవయవాలు వాటంతట అవే కదులుతుంటాయి. నాలుక సైతం స్వాధీనంలో లేకపోవడంతో ఆహరం తీసుకోవడం…
లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లమందికి తాగునీరు అందిస్తున్న మహానది గోదావరి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ అవుతోందా? భద్రాచలం వద్ద గోదావరి కాలుష్య కాసారంగా తయారైందా? గోదావరిలో మునిగితే రోగాలు గ్యారంటీనా? అంటే అవుననే అంటున్నారు. గోదావరికి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలోకి కెమికల్ నీళ్లు వచ్చి చేరుతున్నాయ్. పంటలు సాగు చేయటానికి ఆ నీటినే వాడుతున్నారు. అలా పండిన పంటలను తిని జనం రోగాల పాలవుతున్నారు. కలుషిత నీటిని తాగి ఆస్పత్రుల్లో చేరుతున్నారు జనం.…