TG Assembly Sessions : రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాల నేపధ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో ఈరోజు శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్…
నల్గొండ రూపురేఖలను మార్చేసే నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈపీసీ పద్ధతిలో రూ.524.85 కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగు లేన్లుగా 14 కి.మీ నిర్మిస్తున్న ఈ రోడ్డును ఎలక్షన్ కోడ్ ముగియగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా పూర్వపనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.