నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’. 2012, ఫిబ్రవరి 24న విడుదలై అద్భుతమైన విజయాన్ని చవిచూసిందీ మూవీ. ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ తమ మనోభావాలను ఇలా తెలియచేశారు. హీరో నితిన్: ” ‘ఇష్క్’ నా కెరీర్‌లో మెమొరలబుల్ సినిమా. నటుడిగా నాకు రీ-బర్త్ ఇచ్చింది. ఇంత మంచి సినిమాను దర్శకుడు విక్రమ్ నాకు ఇచ్చారు. పి. సి. శ్రీరామ్ కెమెరా అద్భుతంగా తీశారు. ఈ సినిమా…