విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరో అయినప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన మూడు విభిన్న జోనర్ చిత్రాలు నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాల విడుదల గురించి ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశంసలు పొందిన మలయాళ థ్రిల్లర్ “దృశ్యం-2” తెలుగు రీమేక్ అదే టైటిల్ తో తెలుగులో రూపొందుతోంది.…