టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 19న ప్రముఖ సీనియర్ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ విషాదంలో నుంచి తెలుగు చిత్రసీమ బయటపడక ముందే మరో సీనియర్ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. అలనాటి ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు ఉదయం అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read…