శ్రీ సింహ, సత్య. నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మత్తు వదలరా' చిత్రం డిసెంబర్ 25, 2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ 'మత్తు వదలరా' ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు, ఆ చిత్ర బృందం దాని అధికారిక సీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధమవుతోంది.
‘మత్తు వదలారా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రితేష్ రానా కొత్త సినిమాను ఆరంభించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో జరిగిన పూజతో ఈ మూవీ ఆరంభం అయింది. ఎస్‌ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టగా, కొరటాల…